Sunday, November 28, 2010

The new girlfriend on Gopichand

అల్లు అర్జున్ వేదం చిత్రం ద్వారా పరిచయమైన దీక్షాసేధ్ గుర్తుంది కదా. ఆమె ప్రస్తుతం గోపీచంద్ సరసన వాంటెడ్ చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆమెను చాలా జాగ్రత్తగా గోపీచంద్ డీల్ చేస్తున్నాడని వినిపిస్తోంది. ఇంతకుముందు అనూష్కతో అధ్బుతమైన రిలేషన్ షిప్ మెయింటైన్ చేసి పెళ్ళి దాకా వెళ్ళాలని ట్రై చేస్తే ఆమె అందకుండా జారుకుందని, మనస్సు విరిగిన గోపిచంద్ కొంత కాలం గ్యాప్ తీసుకుని ఇప్పుడు దీక్షాసేధ్ వెనక పడ్డాడని చెప్తున్నారు. ఇక షూటింగ్ సమయంలో ఏమన్నా కావాలంటే వెంటనే సెకెండ్స్ మీద ఎరేంజ్ చేయటం, ప్రతీ పది,పదిహేను నిముషాలకు ఆమె మంచి నీళ్ళు కావాలా, స్నాక్స్ కావాలా అని అడగటం వంటివి యూనిట్ చూస్తున్నారని కూడా పట్టించుకోకుండా చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ఇలాంటి రిలేషన్ షిప్స్ సాధారణంగా సినిమా షూటింగ్ జరిగినంత కాలం ఉంటాయని, ఆ తర్వాత ఎవరికి వారే తప్పుకుంటారని ఇది కూడా అలాంటిదే కావచ్చని సీనియర్స్ అంటున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా రచయిత బి.వి.యస్.రవి దర్శకుడుగా మారుతున్నారు. ఈ చిత్రాన్ని గతంలో గోపీచంద్ తో శౌర్యం చిత్రం నిర్మించిన భవ్య క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మూడు పాటలు మినహా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఇక దర్శకుడు బి.వియస్ రవి గతంలో కళ్యాణ రామ్ జయీభవ, విష్ణు వర్దన్ సలీం, ఝమ్మంది నాదం వంటి చిత్రాలకి కథ, మాటలు అందించారు.

No comments:

Post a Comment