రామ్ చరణ్ తాజగా ట్విట్టర్ లో తను "ఆరెంజ్" చిత్రం చేయటానికి నాలుగు కారణాలు వివరించారు. ఆయన మాటల్లోనే...మొదటగా..నేను రొటీన్ నటుడుని కాకూడదనే ఆరెంజ్ చేసాను. ఇక రెండవ ది..మగధీర చిత్రం తర్వాత నాకు ఓ డిఫెరెంట్ స్టోరీ కావాలనిపించింది..అయితే అది యాక్షన్ స్టోరీ కాకూడదు. కాబట్టి ప్యూర్ లవ్ స్టోరి అయిన ఈ చిత్రాన్ని ఎన్నుకున్నా. ఇక ఈ సినిమా కమిట్ అవగానే చాలామంది నాకు పిచ్చి అనుకున్నారు. ఆలాగే ఆరెంజ్ లాంటి చిత్రం చేయటం మాస్ కి దూరమవుతానని అన్నారు. కానీ అది నిజం కాదు. నేను సమాజంలోని అన్ని వర్గాలకు దగ్గర అవ్వాలనేదే నా ఆలోచన.
ఇక నేను పర్శనల్ గా నమ్మేది ఒక సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరచలేదని. ఇక మూడవది..ఈ చిత్రంలో ఫెవరెట్ సీన్ ..రూబతో విడిపోయే సన్నివేశం. భాస్కర్ ఆ సీన్ నాకు చెప్పేటప్పుడు చాలా ఫీల్ అయ్యాను. ఇక నాలువది..ఈ చిత్రంలో హల్లో రమ్మంటే ..రూబా పాటలు చేస్తున్నప్పుడు చాలా ఉషారుగా అనిపించింది అని మనస్సు విప్పి చెప్పారు. ఇక ఆరెంజ్ చిత్రం ఈ శుక్రవారం విడుదలై ఓ కన్ఫూజ్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది.అయితే రామ్ చరణ్ స్టైల్స్ కి మాత్రం మంచి పేరు వచ్చింది.
No comments:
Post a Comment